10 రోజుల పాటు జరగనున్న టెట్ ఎగ్జామ్స్! 3 d ago
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించిన పూర్తిస్ధాయి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. గతంలో ప్రకటించినట్లుగా జనవరి 1 నుంచి కాకుండా 2వ తేదీ నుంచి 20 వ తేదీ మధ్య మొత్తం 10 రోజులు పరీక్షలు జరుపుతారని విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలు జనవరి 2, 5, 8, 9, 10, 11, 12, 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఆ తేదీలలో ప్రతి రోజూ రెండు సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో విడత పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.